ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

హుజూర్‌నగర్‌ : ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్‌ కోరారు. బుధవారం హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఫిక్సిడ్‌ టెన్యూర్‌ ఎంప్లాయ్‌ (ఎఫ్‌టీఏ)గా గుర్తించాలని, గత ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో తెలంగాణ ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ రాష్ట్ర నాయకులు బొలుగురి రవి, చల్ల వెంకటేశ్వర్లు, కె.సిద్దిరాజు, పరశురాములు, రెమిడాల లింగయ్య, ఉపేందర్‌, శేఖర్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement