అర్వపల్లి : ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నిర్వహించే భవిత కేంద్రాలకు సొంత భవనాలు సమకూరుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో భవిత కేంద్రాల భవనాలను నిర్మించారు. ఒక్కో భవనానికి రూ.9.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. నాగారంలో పనులు పూర్తి చేసి రంగులు కూడా వేశారు. అర్వపల్లిలో రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. నూతనకల్, మద్దిరాల మండలాల్లో పనులు పూర్తికావస్తున్నాయి. ఇప్పటివరకు భవనాలను శిథిలమైన, ఇరుకై న ప్రభుత్వ పాఠశాలల గదులలో నిర్వహిస్తున్నారు. నూతన భవనాలకు రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా మార్చారు.


