సూర్యాపేట టౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని.. కేసీఆర్, హరీష్‌రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్చునివ్వడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదని, 210 కీ.మీ. సొరంగం, బ్యారేజ్‌లు, లిప్టులు, కెనాల్స్ కాళేశ్వరంలో భాగమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దుష్ప్రచారాన్ని మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్‌ను ఏమీ చేయలేరన్నారు. రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయించి నీరివ్వాలని, లేని పక్షంలో లక్షలాది మంది రైతులను సమీకరించి ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పుట్ట కిషోర్, నెమ్మాది భిక్షం, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, ఆకుల లవకుశ, బండారు రాజా, బొమ్మగాని శ్రీనివాస్, తూడి నరసింహా రావు, బెల్లంకొండ యాదగిరి, కోడి సైదులు, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, అమరవాది శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కాళేశ్వరంపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధం
ఫ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్


