నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

భానుపురి (సూర్యాపేట) : రైతులను నిలువునా ముంచే నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ హెచ్చరించారు. మండల స్థాయిలో టాస్క్‌ ఫోర్స్‌, పోలీసులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, రైతులు కూడా గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శ్రీప్రజా పాలన – ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా మార్కెటింగ్‌, అనుబంధ శాఖలు, ఉద్యాన పట్టు పరిశ్రమ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. సూర్యాపేటలో నూతనంగా భూ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. భూసార పరీక్షల నివేదిక ఆధారంగా ఏ భూమిలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో వ్యవసాయ అధికారులు సూచిస్తారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఖర్చు తగ్గింపులో భాగంగా నానో యూరియా వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను, ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే సూర్యాపేటలో మామిడి మార్కెట్‌ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు. సూర్యాపేటలో నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను రూ.31లక్షలతో మరమ్మతులు పూర్తి చేసి త్వరలోనే మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేతుల మీదిగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గట్టు శ్రీనివాసరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షఫీ ఉల్లా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగేశ్వర్‌ శర్మ, జిల్లా సహకార అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement