2028లో బీసీలదే అధికారం | - | Sakshi
Sakshi News home page

2028లో బీసీలదే అధికారం

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్రంలో 2028లో బీసీలు అధికారం చేపట్టడం ఖాయమని, తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డాగా మారిందని ఈ సునామీని ఎవరూ ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం సూర్యాపేటలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర మల్సూర్‌గౌడ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాధికారం లక్ష్యంగా బీసీల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని చెప్పారు. పిడికెడు శాతం ఉన్న వారి పాలన ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు. బీసీలు బలమైన శక్తిగా ఎదిగారని ఇక అగ్రకులాల ఆటలు సాగవన్నారు. 2034 వరకు రేవంత్‌రెడ్డి సీఎంగా కొనసాగుతా అంటున్నాడని, బీఆర్‌ఎస్‌లో కూడా సార్‌ రావాలి ముఖ్యమంత్రి కావాలని ప్రగల్భాలు పలుకుతున్నారని, పదేళ్ల పరిపాలన సరిపోదా అని ఎద్దేవా చేశారు. జూలై 12న హైదరాబాద్‌లో బీసీల రాజకీయ ప్లీనరీ, ఆగస్టు 7న జాతీయ ఓబీసీ సమావేశం, సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలు పల్లె నుంచి పట్టణ వరకు బీసీల రాజ్యాధికార రథయాత్ర చేపడతామన్నారు. డిసెంబర్‌లో 10 లక్షల మందితో రాజకీయ యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీసీ ఐకాస చైర్మన్‌ జాజుల లింగంగౌడ్‌, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ ఉప్పల మధు యాదవ్‌, బీసీ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తిగౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, నిద్ర సంపత్‌నాయుడు, బెల్లంకొండ సైదులు, నేరెళ్ల దేవరాజుయాదవ్‌, మామిడి శ్రీనివాస్‌యాదవ్‌, పోతురాజు నరసయ్య, సూర్యగౌడ్‌, రాచకొండ సురేష్‌గౌడ్‌, బైరు విజయకృష్ణ, తండు అంజయ్య, అబ్బగాని వెంకటయ్య, పిల్లుట్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ఫ తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డాగా మారింది

ఫ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement