మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి నాగవళ్లీ దళాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు రామాచార్యులు, బదరీనారాయణాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.


