ముగిసిన ఎడ్ల పందేలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎడ్ల పందేలు

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

మఠంపల్లి : మండల కేంద్రంలోని మేరీమాత పుణ్యక్షేత్రం వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు మంగళవారం అర్ధరాత్రి ముగిశాయి. శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి బుధవారం విజేతలను ప్రకటించారు. సీనియర్స్‌ కేటగిరీలో ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన గిత్తలు ప్రథమ బహుమతి గెలుపొందాయి. అదేవిధంగా రెండో బహుమతిని కృష్ణా జిల్లా ఎడ్లపాడు గిత్తలు, మూడో బహుమతిని గుంటూరు జిల్లా కాకుమాను గిత్తలు, నాలుగో బహుమతిని సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన గాదె సుందరమ్మ గిత్తలు గెలుపొందాయి. విజేతలకు స్థానిక సర్పంచ్‌ వీరలక్ష్మిపాపయ్య, ఉప సర్పంచ్‌ కొత్తపల్లి శౌరీ, పాలకవర్గ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ స్రవంతీకిషోర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ లూర్థుమారెడ్డి, శుభోదయ యువజన సంఘం సభ్యులు, చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మేడేను జయప్రదం చేయాలి

సూర్యాపేట అర్బన్‌ : మే ఒకటిన మేడే సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో ఎర్ర జెండాలు ఎగురవేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నరసయ్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని లెనిన్‌నగర్‌లో మేడే పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాజేసందుకు లేబర్‌ కోడ్‌లను తీసుకు వచ్చిందన్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దయ్యే వరకు కార్మిక లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్‌ కుమార్‌, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే గులాం, జిల్లా కోశాధికారి ఐతరాజు వెంకన్న, నాయకులు భీమనపల్లి సురేష్‌, ప్రవీణ్‌, పాల్వాయి అనసూర్య, రేణుక, ఖాసీం, వెంకన్న పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement