పెన్‌పహాడ్ : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జీవిత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చదువులో అంతరాయం వంటి అంశాలను వివరించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, బాలల పరిరక్షణ విభాగం అధికారి రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, సీడబ్ల్యూసీ మెంబర్ ధనమ్మ, ఎంఈఓ రవి, ఎస్‌ఓ ఆసియా జబీనా పాల్గొన్నారు.
ఫ జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు


