నలభై వసంతాలకు అపూర్వ కలయిక | - | Sakshi
Sakshi News home page

నలభై వసంతాలకు అపూర్వ కలయిక

Apr 27 2026 8:42 AM | Updated on Apr 27 2026 8:42 AM

నలభై వసంతాలకు అపూర్వ కలయిక

హుజూర్‌నగర్‌ : వారంతా నలభై ఏళ్ల క్రితం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒకే వేదికపై కలిశారు. వారే హుజూర్‌నగర్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1985–86 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు. వీరు ఆదివారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని వర్తక సంఘం భవనంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని రోజంతా గత తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం అప్పట్లో తమకు పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సన్మానించారు. తొలుత పాఠశాల ప్రాంగణంలో సహా విద్యార్థి గొర్రె సదాశివానందరెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయంతో నిర్మించిన భారతదేశ చిత్రపటాన్ని ఎంఈఓ భూక్య సైదా నాయక్‌, హెడ్మాస్టర్‌ తాతరాజు శ్రీనివాసరావు, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు ఎంఎస్‌ఎన్‌ రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో దామోదరా చార్యులు, రాము గురుపాదం, గోపాల్‌దాస్‌, వెంకటేశ్వర్లు, గణేష్‌, భిక్షపతి, మహబూబ్‌ అలీ, శ్రీను, మురళి, సక్రు, దాదాపు 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement