ఉద్యోగోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

సూర్యాపేటటౌన్‌ : ఉద్యోగోన్నతితో బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ నరసింహ అన్నారు. ఆర్ముడ్‌ రిజర్వ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకన్న, తిరుపతయ్యలు ఆర్‌ఎస్‌ఐలుగా ప్రమోషన్‌ పొందారు. అదేవిధంగా హెడ్‌ క్వార్టర్స్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న రామకోటి ఎస్‌ఐగా, గరిడేపల్లి పీఎస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటయ్యకు ఏఎస్‌ఐగా ప్రమోషన్‌ వచ్చింది. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వారికి ప్రమోషన్‌ ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్యం పట్ల, కుటుంబాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ నరసింహచారి పాల్గొన్నారు.

అకాల వర్షాలతో జాగ్రత్త

రానున్న మూడు రోజులు వడగండ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిందని, ధాన్యం ఆరబోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేట మండలంలోని పిన్నాయిపాలెం గ్రామ శివారులో ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడి జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. పంట తడవకుండా టార్పాలిన్లు, పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఎండ వేడి వల్ల వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement