ఇక.. ఆటాపాట | - | Sakshi
Sakshi News home page

ఇక.. ఆటాపాట

Apr 24 2026 6:44 AM | Updated on Apr 24 2026 6:44 AM

నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

ముగిసిన 2025–26 విద్యా సంవత్సరం

జూన్‌ 12న స్కూళ్లు పునఃప్రారంభం

సూర్యాపేట టౌన్‌ : విద్యార్థులకు వేసవి సెలవలొచ్చాయ్‌.. సంవత్సరం పాటు పుస్తకాలతో కుస్తీపట్టి పాఠశాలల్లో గడిపిన విద్యార్థులు శుక్రవారం నుంచి ఆటాపాటలతో గడపనున్నారు. 2025–26 విద్యా సంవత్సరం గురువారంతో ముగిసింది. ముగింపు రోజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశాల నిర్వహించి విద్యార్థుల ప్రొగ్రెస్‌ కార్డులు అందజేశారు. కాగా గురుకులాలు, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు రెండు రోజుల క్రితమే సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ సమ్మె కొనసాతుండడంతో బస్సుల కొరత ఏర్పడి విద్యార్థులు బైకులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ వేసవి సెలవులు జూన్‌ 11వ తేదీ వరకు ఉండనున్నాయి. తిరిగి పాఠశాలలు 2026–27 విద్యా సంవత్సరం జూన్‌ 12వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement