రైతులు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

రైతులు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్‌

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి మార్కెట్‌లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మార్కెట్‌లో హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్‌ సౌజన్యంతో మార్కెట్‌ కమిటీ ఏర్పాటు చేసిన రూ.5లకే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ బాలకృష్ణ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఎంఓ నాగేశ్వరశర్మ, డీసీఓ ప్రవీణ్‌, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement