దొడ్డి కొమురయ్య జీవితంపై సినిమా | - | Sakshi
Sakshi News home page

దొడ్డి కొమురయ్య జీవితంపై సినిమా

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

30 మంది కోదాడ వాసులు సహ నిర్మాతలుగా ..

కోదాడ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రపై నిర్మిస్తున్న సినిమాకు కోదాడకు చెందిన 30 మంది సహ నిర్మాతలుగా ఉన్నారని చిత్రం నిర్మాణ కమిటీ చైర్మన్‌ అంకతి అనసూర్య తెలిపారు. సినిమా వాల్‌ పోస్టర్‌ను శుక్రవారం కోదాడలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చిత్రం నిర్మాణ కమిటీతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, కళాకారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల చరిత్రను వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమా దర్శకుడు ఎం.సేనాపతి మాట్లాడుతూ ఒక్కో జిల్లా నుంచి 26 మంది తెలంగాణ కళాకారులను తీసుకొని ఈ సినిమాను పూర్తిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పందిరి నాగిరెడ్డి, రాయపూడి చిన్ని, ఇర్ల శ్రీనివాసరెడ్డి, రాపర్తి రామనర్సయ్య, రావూరి భవాని, తిరపతయ్య, తేరేజమ్మ, ఎస్‌ఎస్‌.రావు, కోదాటి గురవయ్య, సుంకర పుల్లారావు, మజహార్‌, కల్లూరి సుజాత, జగదీష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement