మునగాల: వైద్య సిబ్బంది తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా పరిపాలన అధికారి డాక్టర్ కోటిరత్నం హెచ్చరించారు. మునగాల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పోలేపల్లి రవీందర్‌పై ఇటీవల వచ్చిన అభియోగాలపై కలెక్టర్ ఆదేశానుసారం వైద్యశాఖ ఉన్నత అఽధికారుల కమిటీ బుధవారం విచారణ చేపట్టింది. ఈ విచారణ కమిటీలో వైద్యశాఖ జిల్లా పరిపాలన అధికారి డాక్టర్ కోటిరత్నం, కోదాడ డిప్యూటీడీఎంహెచ్‌ఓ ఎం.మాధవ్‌కుమార్ ఉన్నారు. వీరి ఆస్పత్రికి వెళ్లి వైద్యాధికారి రవీందర్‌తో పాటు, అభియోగాలు మోపిన ఎంఎల్‌హెచ్‌పీ దివ్యను విచారించారు. పరిపాలన అధికారి డాక్టర్ కోటిరత్నం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.మాధవ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ తోటి ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, మానసిక వేధింపులకు తావు లేకుండా ,భవిష్యత్‌లో ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా నివేదిక అనంతరం సీసీఏ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.


