అన్ని వసతులు సమకూర్చాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని వసతులు సమకూర్చాలి

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ బాలసదనం, అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలకు అన్ని వసతులు సమకూర్చాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. సోమవారం ప్రజా పాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ప్రభుత్వ బాలసదనం, అనాధాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ, సంరక్షణ అవసరమున్న పిల్లలకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, బాలల అధికారి రవికుమార్‌, బాల సంక్షేమ సమితి చైర్మన్‌ బి.రమణారావు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement