తిరుమలగిరి (తుంగతుర్తి) : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన పలువురు శుక్రవాం తిరుమలగిరిలోని మోత్కూరు–తొర్రూరు ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని అనంతారంలో స్లాబ్ వరకు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అనంతారం, తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని కొందరు ఉండటానికి కొద్దిరోజులుగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వచ్చి అధికారులతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమింపజేశారు.
ఫ అనంతారం గ్రామస్తుల ధర్నా
ఫ అధికారుల హామీతో విరమణ


