సూర్యాపేటటౌన్ : పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఎస్‌ఐ సత్యనారాయణ కుటుంబానికి రూ.10లక్షల సాలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ పథకం పోలీసు కుటుంబాలకు ఆర్థికంగా బాసటగా నిలుస్తోందన్నారు. సిబ్బంది అందరూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పోలీసు సిబ్బంది సాలరీ ప్యాకేజ్ అకౌంట్‌గా మార్పు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఏఓ మంజుభార్గవి, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ రామారావు, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు.


