మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచా మృతాభిషేకం చేపట్టారు. స్వామి అమ్మవార్లలను నూతన పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం సంవాదం రక్తి కట్టించారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


