ప్రభుత్వ స్థలం పరాధీనం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలం పరాధీనం

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు(ఎకరాలలో)

కోదాడ మున్సిపాలిటీ పరిఽధిలోని కొమరబండ వై జంక్షన్‌ వద్ద సర్వేనంబర్‌ 48/3ఏ/1/, 48/3బీ/1లో ఉన్న 1.08 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించారు. రెవెన్యూ అధికారులు రూ.80 వేలు ఖర్చు చేసి దాని చుట్టూ యుద్ధప్రాతిపదికన ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. కానీ రాత్రికి రాత్రే కొందరు బోర్డును తొలగించారు. దాంతో అధికారులు సమీపంలోని గోడ మీద ‘ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం’ అని రాయించారు. దానిపైన కూడా కొందరు నల్లరంగు పూసి కనబడకుండా చేశారు. అయినా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే దానిపై కొందరు కోర్టుకు వెళ్లారని చెపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొందరు సమీపంలోని సర్వే నంబర్‌పై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించి ప్రభుత్వ భూమిని తమదిగా చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కోదాడ : కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. ఆక్రమణలపై స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. మరి కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడి దొడ్డిదారిని ఆక్రమణ దారులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారు. కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 39లో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి నుంచే కోదాడ –ఖమ్మం బైపాస్‌ రోడ్డు వేశారు. ఇక్కడ గతంలో 56 మంది లబ్దిదారులకు 14.13 ఎకరాల భూమిని అసైన్‌ చేయగా.. మరో 28 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. ఈ భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించగా గతంలో ఇక్కడ పని చేసిన అధికారి వారికి అక్రమంగా పట్టాదారు పాస్‌పుస్తకాన్ని జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు గతం సంవత్సరం సర్వే చేశారు. కానీ రాజకీయ ఒత్తిడితో ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే వారు కోర్టుకు వెళ్లారని చెబుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

చెరువునే మాయం చేసినా...

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి దక్షిణం వైపు 30 ఎకరాలలో సాగిచెరువు ఉండేది. 2008లో కోదాడ బైపాస్‌ రోడ్డు సర్వే చేసిన హైవే అధికారులు తయారు చేసిన మ్యాప్‌లో రోడ్డుకు సమీపంలో చెరువు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. పట్టణం విస్తరించి భూముల రేట్లు పెరిగాయి. దాంతో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. అధికారులను మచ్చిక చేసుకొని చెరువు కట్టకు గండిపెట్టి దశలవారీగా చెరువును ఆక్రమించారు. కోదాడ మాజీ సర్పంచ్‌ తమ్మర వెంకటేశ్వరరావు ఇచ్చిన సీలింగ్‌ ఎక్సెస్‌ భూములను సైతం కొందరు తమ పేరుతో మార్పిడి చేయించుకొని ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు సమాచారం. దీనికి సమీపంలోనే సర్వే నంబర్‌ 758లో దాదాపు రెండు ఎకరాల భూదాన భూమికూడా ఆక్రమణకు గురవుతుంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపి వాటిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ఫ కబ్జాలో రూ.కోట్ల విలువైన భూములు

ఫ ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం

ఫ అధికారులు సర్వే చేసి

ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికుల వినతి

సర్వేనంబర్‌ రెవెన్యూ విలేజ్‌ విస్తీర్ణం అసైన్‌ చేసింది మిగిలింది

39 తమ్మర 42.09 14.13 28.00

635 శ్రీరంగాపురం 31.21 7.00 24.00

758 కోదాడ 1.37 – 1.37

48/3ఏ/1/48/3బి/1 కొమరబండ 1.08 – 1.08

360 బండపాలెం 15.15 – 15.15

Advertisement
 
Advertisement
Advertisement