అర్వపల్లి : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అర్వపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లారీల కొరతతో ధాన్యం ఎగుమతులు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మిల్లర్లు తాలు పేరుతో ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రాలలో సకాలంలో కాంటాలు, ధాన్యం ఎగుమతులు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు దండ వెంకట్‌రెడ్డి, పులుసు సత్యం, కొప్పుల రజిత, పార్టీ మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్, నాయకులు శిగ వెంకన్న, బొడ్డు సైదులు, అబ్బులు, కొమ్ము విజయ్, సంపతి వెంకన్న, సుజాత, శిగ శ్రీను ఉన్నారు.


