ఘోష్‌ కమిషన్‌ నివేదిక తప్పుల తడక | - | Sakshi
Sakshi News home page

ఘోష్‌ కమిషన్‌ నివేదిక తప్పుల తడక

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించిన ఘోష్‌ కమిషన్‌ నివేదిక తప్పుల తడకగా ఉందని తిరుమలగిరి మున్సిపల్‌ చైర్మన్‌ సంకెపల్లి రఘునందన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగం చేశారని కాంగ్రెస్‌ నాయకుల ఆరోపణలు సరి కాదన్నారు. కాళేశ్వరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు. కోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్‌ నేతల తీరులో మార్పు రావాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్‌, నాయకులు దూపటి రవీందర్‌, మోడెపు సురేందర్‌, కందుకూరి బాబు, కారుపోతుల నరేష్‌, ఫత్తెపురం త్రిశూల్‌, యాకూబ్‌నాయక్‌, పణికెర యాదగిరి, బర్ల వెంకన్న, బొడ్డు సైదులు, ప్రవీణ్‌, రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement