ధాన్యం దిగుమతుల్లో జాప్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం దిగుమతుల్లో జాప్యం చేయొద్దు

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

కోదాడరూరల్‌ : మిల్లర్లు ధాన్యం దిగుమతుల్లో జాప్యం చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ హెచ్చరించారు. బుధవారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో పలు రైస్‌ మిల్లులను ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్‌ తనిఖీ చేసి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చి ధాన్యం లారీలను తరుగు పేరుతో కొర్రీలు పెట్టకుండా అన్‌లోడ్‌ చేసి తిరిగి పంపించాలని అందునుగుణంగా కూలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్టీఓ సూర్యనారాయణ, తహసీల్దార్‌ సంతోష్‌కిరణ్‌ఉన్నారు.

ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు పాటించాలి

భానుపురి (సూర్యాపేట) : ఘన వ్యర్థ్యాల నిర్వహణ నియమాలు పాటించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సాలిడ్‌ వేస్ట్‌ డిస్ట్రిక్ట్‌ మానిటరింగ్‌ కమిటీ సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి, ఘన వ్యర్థాల నిర్వహణకు శానిటేషన్‌ ప్లాన్‌ ను గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే 15 రోజుల్లోగా యాక్షన్‌ ప్లాన్‌ సమర్పించాలన్నారు. ప్రతి వ్యర్థ ఉత్పత్తిదారుడు ఘన వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం కలగకుండా నివారించేందుకు, తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ శిరీష, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మున్సిపల్‌ కమిషనర్లు హనుమంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాసు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement