మద్దిరాల : యువత మద్యం, డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని అడిషనల్ ఎస్పీ పాలకూరి నారాయణ, డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. శుక్రవారం మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల గ్రామంలో పోలుమల్ల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ సొసైటీ, రోడ్డు సేఫ్టీపై యువతకు 2 కే రన్ ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ నారాయణ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి 2 కే రన్ ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన పోలుమల్ల స్పోర్ట్స్ క్లబ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, మద్యానికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. పోలుమల్ల యువత చక్కటి నిర్ణయం తీసుకుని డ్రగ్ ఫ్రీ సొసైటీ, రోడ్డు సేఫ్టీపై 2 కే రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం గోరెంట్ల తెలుగు ఉపాధ్యాయుడు ప్రభాకర్ వినూత్న వేషధారణలో డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణపై యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎం.వీరన్న, సర్పంచ్ రేసు లింగయ్య, ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ జహీర్, వెంకటయ్య, ఎలిపెద్ది రవి, స్పోర్ట్స్‌శ్రీ క్లబ్ అధ్యక్షుడు జటంగి శ్రవణ్‌కుమార్, రేసు సతీష్, రేసు తరుణ్, మామునూరి ఉపేందర్, రాకేష్, అంజి, ప్రవీణ్‌కుమార్, సాయిరెడ్డి, ఉమేష్, మహేష్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీ పాలకూరి నారాయణ


