భానుపురి (సూర్యాపేట) : కార్మికుల హక్కుల సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన డ్రైవర్ శంకర్‌గౌడ్ లాంటి అమరవీరుల స్ఫూర్తితో ఆర్టీసీని రక్షించుకుని హక్కులను సాధించుకుందామని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక డిపో ఆవరణలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణత్యాగం చేసిన నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకర్ గౌడ్ ప్రాణత్యాగం సమ్మె డిమాండ్ల పరిష్కారానికి ప్రభావితం చేసిందన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు బత్తుల సుధాకర్, డీఆర్ కుమార్, పీఎం రావు, సేవియా, లక్ష్మయ్య, రవి, నాగరాజు, డి సి నాయక్, మోహన్, పీసీ శేఖర్, అక్బర్, సందేశ్, అనిజిత్, వీరయ్య, ఎల్లమ్మ,, శ్రీదేవి అలివేలు, రజిత పాల్గొన్నారు.


