నార్కట్‌పల్లి : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి అర్చకలు లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి వేళ భక్తులకు దర్శనం కల్పించారు. ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ పూజలు సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు. గట్టుపైన ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు పైకి వాహనాలను అనుమతించలేదు. కార్యక్రమంలో చెర్వుగట్టు దేవాలయ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, ఈఓ మోహన్‌బాబు, ఎస్‌ఐ విష్ణుమూర్తి, డైరెక్టర్లు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, నల్ల అనిత,ఇరుడుల సంపత్‌కుమార్, మర్రి లింగస్వామి, కమ్మలపల్లి మల్లేష్, రేగట్టె శ్రీనివాస్‌రెడ్డి, వీరెల్లి రఘునాథ్, శ్రీను, పాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


