సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద విస్తృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద విస్తృత తనిఖీలు

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

కోదాడరూరల్‌ : ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయాలని చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌ వద్ద గల అంతరాష్ట్ర చెక్‌ పోస్టును ఆయన తనిఖీ చేశారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, పీడీఎస్‌ బియ్యం, మద్యం, ఇసుక వంటివి అక్రమ రవాణా జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అనంతగిరి ఎస్‌ఐ నవీన్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ అంజిరెడ్డి ఉన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ అధికారులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. నూతనంగా నియామకమైన డిప్యూటీ తహసీల్దార్లకు పోలీసు అంశాలపై శిక్షణలో భాగంగా గురువారం వారు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి పలు విషయాలపై సలహాలు, సూచనలు చేశారు. వారం రోజులపాటు పోలీసులతో కలిసి పని చేయడంపై శిక్షణ ఉంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement