సూర్యాపేట టౌన్ : ఉద్యోగుల పీఆర్‌సీ, డీఏలు తక్షణమే విడుదల చేయాలని బీసీ టీచర్స్ యూనియన్ (బీసీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తి అన్నారు. సూర్యాపేటలోని డీఈఓ కార్యాలయంలో గురువారం బీసీటీయూ క్యాలెండర్‌ను డీఈఓ అశోక్‌తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నేరేళ్ల దేవరాజ్, కోశాధికారి శ్రీమండల సైదులు, పోతురాజు నరసయ్య, సూర్య, నాయకులు పొడిశెట్టి శ్రీధర్, ఎ.రామకష్ణ, బట్టుపల్లి సాయికుమార్ పాల్గొన్నారు.


