డీజిల్‌ కోసం బారులు | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ కోసం బారులు

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

అర్వపల్లి, మునగాల, ఆత్మకూర్‌(ఎస్‌) : జిల్లాలో పెట్రోల్‌ కష్టాలు తీరడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని బంక్‌లలో పెట్రోల్‌, డీజిల్‌ స్టాక్‌ అయిపోవడంతో అవి మూతపడ్డాయి. స్టాక్‌ ఉన్న బంక్‌లలో వాహనాలు బారులుదీరాయి. మండుటెండలో గంటల కొద్దీ లైన్‌లో నిల్చొని మరీ పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అర్వపల్లి మండలంలో రెండు రోజులుగా డీజిల్‌ కొరత తీవ్రమైంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండటంతో వాహనాలకు డీజిల్‌ వాడకం పెరిగింది. దీనికి తోడు తుంగగూడెం ఇసుక రీచ్‌ నుంచి ప్రతిరోజు 400 ట్రాక్టర్‌ల ఇసుక రవాణా జరుగుతోంది. ఆయా వాహనాలకు ప్రతిరోజు వేల లీటర్ల డీజిల్‌ అవసరం. పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా ఆయా వాహనాలు బంక్‌ల వద్ద బారులు దీరుతున్నాయి. అర్వపల్లితో పాటు తిమ్మాపురంలోని బంక్‌లలో డీజిల్‌ కోసం క్యూలైన్‌లలో క్యాన్‌లు, డ్రమ్‌లు పెట్టారు. మునగాల మండలంలోని జాతీయ రహదారిపై గల బరాఖత్‌గూడెం, మునగాల, ముకుందాపురం, ఆకుపాముల, తాడువాయి గ్రామాల శివారులో ఉన్న ఏడు పెట్రోల్‌ బంక్‌లలో స్టాక్‌ వచ్చిన నాలుగైదు గంటలలోనే ఖాళీ అవుతోంది. క్యూలో ఉన్నవారికి సైతం పెట్రోల్‌, డీజిల్‌ దొరికే పరిస్థితి లేదు. మంగళవారం ఏడు బంక్‌లలోనూ నో స్టాక్‌ బోర్డులు పెట్టారు.

పెట్రోల్‌ కోసం సూర్యాపేటకు

ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంతో పాటు నెమ్మికల్‌, ఏపూరు పెట్రోల్‌ బంకులు స్టాక్‌ లేక మూత పడ్డాయి. దాంతో రెతులు సూర్యాపేటకు వచ్చి డీజిల్‌ను ఆటోల్లో తీసుకెళుతున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌కు డీజిల్‌ రావడంతో వాహనదారులు బారులు దీరారు

ఫ జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత

ఫ బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు

ఫ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

Advertisement
 
Advertisement
Advertisement