సెలవుల్లోనూ..సంపూర్ణ పోషణ | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లోనూ..సంపూర్ణ పోషణ

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

1209 కేంద్రాలు

చిలుకూరు : వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు మంజురు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు సెలవులుగా ప్రకటించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజు అందించే పౌష్టికాహారాన్ని ముందస్తుగానే పంపిణీ చేయనున్నారు. గతంలో అంగన్‌వాడీ టీచర్‌, ఆయా ఒకరి తర్వాత మరొకరు 15 రోజులు సెలవులు తీసుకొని మిగతా రోజుల్లో పిల్లల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం ఇచ్చే వారు. కానీ ఈ సారి మాత్రం మందస్తుగానే సరుకులు పంపిణీ చేసి అంగన్‌వాడీ కేంద్రాన్ని పూర్తిగా మూసి వేయనున్నారు.

వేసవి నుంచి ఉపశమనం

అంగన్‌వాడీ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు వచ్చి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో అద్దె భవనాల్లో, ఉక్కపోత మధ్య పిల్లలు, సిబ్బంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వం నెలరోజుల పాటు కేంద్రాలకు సెలవులు ప్రకటించింది.

అందించే సరుకులివే..

కందిపప్పు: చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున 25 రోజులకు 375 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు రోజుకు 30 గ్రాముల చొప్పున మొత్తం 750 గ్రాములు ఇవ్వనున్నారు.

బియ్యం : చిన్నారులకు రోజుకు 75 గ్రాముల చొప్పున 25 రోజులకు కేజీ 875 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు రోజుకు 150 గ్రాముల చొప్పున 3.750 కేజీలు

నూనె: చిన్నారులకు రోజుకు 5 గ్రాముల చొప్పున 25 రోజులకు 125 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు రోజుకు 16 గ్రాముల చొప్పున మొత్తం 400 గ్రాములు.

పాలు: చిన్నారులకు రోజుకు 250 ఎమ్‌ఎల్‌ చొప్పు న 25 రోజులకు 5 లీటర్లు పంపిణీ చేయనున్నారు.

క్రోడిగుడ్లు: చిన్నారులకు, గర్బిణులు, బాలింతలకు రోజుకు ఒకటి చొప్పున 25 పంపిణీ చేయనున్నారు.

సూర్యాపేట జిల్లాలో మొత్తం 1209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 5,600 మంది గర్భిణిలు, 4,100 మంది బాలింతలు, 47,683 మంది చిన్నారులున్నారు. ఇందులో 0–3 వయసు ఉన్న వారు 29,388 మంది, 3–5 వయస్సు ఉన్న వారు 19,717 మంది ఉన్నారు. మే నెలలో 31 రోజులు ఉండగా ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు పోను 25 రోజులకు గానూ పౌష్టికాహారం పంపిణీ చేయనున్నారు.

ఫ మే1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు

వేసవి సెలవులు

ఫ చిన్నారుల ఇంటికే పౌష్టికాహారం

ఫ 25 రోజుల సరుకులు

అడ్వాన్స్‌గా అందజేత

Advertisement
 
Advertisement
Advertisement