మట్టపల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

భానుపురి (సూర్యాపేట) : మట్టపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29 నుంచి మే4 వరకు నిర్వహించే స్వామివారి తిరు కల్యాణోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మిషన్‌ భగీరథ నీటిని నిరంతరం సరఫరా చేయాలన్నారు. పోలీస్‌శాఖ పటిష్ట భద్రత కల్పించాలని, వైద్య ఆరోగ్య శాఖ మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు. దేవస్థాన అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సహాయసహకారాలు అందించి స్వామివారి తిరు కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, అడిషనల్‌ ఎస్పీ రవీందర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వి.శ్రీనివాసులు, కె.భాస్కర్‌, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.భాస్కర్‌, ఆలయ అనువంశిక ధర్మకర్త విజయకుమార్‌, ఈఓ బి.జ్యోతి, అధికారులు పాల్గొన్నారు.

ఉత్సవాలను విజయవంతం చేయాలి

హుజూర్‌నగర్‌ : మట్టపల్లి మహా క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్‌డీఓ శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆర్‌డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, ఆలయంలో క్యూలైన్లు, పార్కింగ్‌ స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.భాస్కర్‌, అనువంశిక ధర్మకర్తలు, సీఐ చరమందరాజు, తహసీల్దార్‌ మంగ, అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement