సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

చిలుకూరు : సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్‌ రజికాంత్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా బుధవారం చిలుకూరు మండలంలోని బేతవోలులో గల రైతు వేదికలో వానాకాలం సీజన్‌ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని, తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వట్టికూటి నాగయ్య, ఏఓ శ్రీధర్‌, ఏఈవోలు చంద్రశేఖర్‌, శిరీష, వసీమా, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement