పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల తనిఖీలు

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

సూర్యాపేటటౌన్‌ : డ్రగ్స్‌, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిరోధంలో భాగంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట పట్టణంలో పోలీసులు, యాంటి నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. పీఎస్‌ఆర్‌ సెంటర్‌, ఖమ్మం అండర్‌ పాస్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో టీ దుకాణాలు, పాన్‌ షాపులలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్‌ఐలు ఏడుకొండలు, శివ తేజ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణం జాతీయ రహదారిపై ఉన్నందున మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు విస్రృతంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అనుమానిత ప్రదేశాల్లో నిత్యం తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో పటిష్ట భద్రత కల్పించడమే పోలీసుల లక్ష్యమన్నారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement