అక్రమ రవాణాపై పటిష్ట నిఘా | - | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాపై పటిష్ట నిఘా

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

సూర్యాపేటటౌన్‌ : పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్‌ బియ్యం రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా పెట్టామని ఎస్పీ నరసింహ తెలిపారు. చెక్‌ పోస్టులలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తునట్లు తెలిపారు. హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల వద్ద అంతర్‌ జిల్లా చెక్‌ పోస్ట్‌ను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. చెక్‌ పోస్ట్‌ రికార్డులను పరిశీలించారు. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల సమయంలో చెక్‌ పోస్ట్‌ సిబ్బంది స్వీయ రక్షణ పాటించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో అంతర్‌రాష్ట్ర, అంతర్‌ జిల్లా సరిహద్దు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామమన్నారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినట్లైతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం సంతలో కొనుగోలు చేసిన పశువుల రవాణా చేస్తే సంత అధికారులు, పశువుల వైద్యుల అనుమతి పత్రాలు వెంట తీసుకువెళ్లాలన్నారు. ఆయన వెంట సూర్యాపేట రూరల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్సై బాలునాయక్‌, చెక్‌ పోస్ట్‌ విధులు నిర్వహణ సిబ్బంది, జాతీయ రహదారుల సిబ్బంది ఉన్నారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement
 
Advertisement
Advertisement