అర్వపల్లి : అర్వపల్లి శివారులోని విద్యుత్ ఉపకేంద్రంలో ఉన్న ఏఈ కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 40 ఏళ్ల క్రితం సబ్ స్టేషన్ ఏర్పాటు చేసే సమయంలోనే ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయం, స్టోర్ రూం, ఆపరేటర్ గదితో పాటు ఇతర గదులను నిర్మించారు. ప్రస్తుతం ఇవి శిథిలమయ్యాయి. భవనంపై చెట్లు పెరుగుతున్నాయి. దాంతో ఏఈతో పాటు సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవి కూలితే సిబ్బంది ప్రాణాలకే ప్రమాదం. ఉన్నతాధికారులు స్పందించి శిథిలమైన భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని సిబ్బంది కోరుతున్నారు.


