టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

నల్లగొండ : నల్లగొండలోని రాంనగర్‌లో గల ఎస్‌బీఐ ఆర్‌సెటి (స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ)లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ సియాజిరాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీలోగా ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌ : 9701009265 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

నడిగూడెం : ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అధ్యాపకులు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి సులోచనా రాణి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై పలు విషయాలపై మట్లాడారు. ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అనంతరం వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్‌లకు సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్‌ డి.విజయనాయక్‌, అధ్యాపకులు డాక్టర్‌.జానిపాషా, కర్నాటి శ్రీధర్‌, మహేష్‌, ఈశ్వర్‌, ఉపేందర్‌, శ్రీనివాస్‌, వీరన్న, నాగరాజు, మదార్‌ ఉన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

పెన్‌పహాడ్‌ : ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ జిల్లా ప్రాజెక్ట్‌ అధికారి ఉమామహేశ్వరి సూచించారు. గురువారం మండల కేంద్రంతో పాటు లింగాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీదేవితో కలిసి ఆమె సందర్శించారు. ఆయా కేంద్రాలలో అందుతున్న వైద్య సేవలను, రికార్డులను పరిశీలించారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా అందుతున్న నిధుల వినియోగం, వాటి వ్యయ వివరాలు, మందుల నిల్వలకు సంబంధించిన స్టాక్‌ రికార్డులను తనిఖీ చేశారు. ఆమె వెంట మండల వైద్యాధికారి రాజేష్‌, ఎంఎల్‌హెచ్‌పీ రవీందర్‌, నసీమ ఉన్నారు.

వృద్ధాశ్రమాలలో

వసతులు కల్పించాలి

మునగాల : వృద్ధాశ్రమాల్లో తగిన వసతులు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు ఆదేశించారు. మండలంలోని ముకుందాపురం శివారులో గల ఇందిర అనాథ, వృద్ధాశ్రమాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆశ్రమానికి సంబంధించిన రికార్డులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వృద్ధా శ్రమాలలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సదరు వృద్ధాశ్రమంలో వసతులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆశ్రమ వ్యవస్థాపకురాలు నాగిరెడ్డి విజయమ్మ, ఇన్‌చార్జి వాచేపల్లి జ్యోతి ఉన్నారు.

యాదగిరీశుడికి పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఘనంగా ఊరేగించారు.

Advertisement
 
Advertisement
Advertisement