పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. ఇటివల బాధ్యతలు చేపట్టిన జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్‌ శివరామ్‌ప్రసాద్‌ స్వాగత కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్‌ అసోషియేషన్‌ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులు కక్షిదారులకు అందుబాటులోకి ఉండాలన్నారు. జూనియర్లు, సీనియర్ల సలహాలు పాటించి, వృత్తిలో రాణించాలన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్‌ సివల్‌ జడ్జి మంచాల మమత, బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సెన్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద

Advertisement
 
Advertisement
Advertisement