‘జగనన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’ | YSRCP Leader RK Roja Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘జగనన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’

Jun 23 2025 4:31 PM | Updated on Jun 23 2025 5:47 PM

YSRCP Leader RK Roja Slams Chandrababu Govt

తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. జగనన్న ఎక్కడకు వెళ్లినా సముద్రంలా జనప్రవాహం వస్తోందన్నారు రోజా. అదే సమయంలో ఈవీఎం ప్రభుత్వం అని ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. 

‘కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలుకు దిగుతున్నారు, కేసులు పెడుతున్నారు. జూన్ 18న జగనన్న కాన్వాయ్ ముందు చనిపోయారు అంటూ ఎస్పీ  చెప్పారు, జూన్ 22 తేదీ నాటికి ఎస్పీ చేత అబద్ధం చెప్పించారు. కల్తీ నెయ్యి ఘటనలో ఈవో ముందు నిజాలు మాట్లాడిన తర్వాత మాట్లాడించారు, ఆ తర్వాత వారం రోజుల్లో ఎలా  వెంటనే మాట మార్చారు అనేది ప్రజలు గమనించారు. 

ఏడాది గా జరుగుతున్న ఘటనలపై కూడా కేసులు పెట్టాలి. సింహాచలం గోడ ఘటనలో అద్భుతమైన ఏర్పాట్లు చేశాం అన్నారు హోం మంత్రి,  గోడ కూలి భక్తులు చనిపోయిన ఘటనపై హోం మంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, గేమ్ చేంజర్‌ సినిమా ఈవెంట్ లో బైక్ స్టంట్ లు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని ఇద్దరు చనిపోయారు. 

దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, ఏడాది పాలనలో మీ ప్రభుత్వంలో మీటింగ్‌లకు ప్రజలు రావడం లేదు. జగనన్న మీటింగ్‌లకు పొలాల్లోంచి పరుగులు పెడుతూ జనం వస్తున్నారు. మీరు విడుదల చేసిన క్లిప్‌లో ముందు, వెనుక వీడియా విడుదల చేయాలి. జగనన్న ప్రజల మనిషి. కోవిడ్‌ సమయంలో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడారో ఈ రాష్ట్ర  ప్రజలు అందరికీ తెలుసు. మానవత్వం లేని వాళ్లు మీరు, మీ కుమారుడు, అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారు’ అని ఆర్‌కే రోజా మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement