‘మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు’ | YSRCP Leader RK Roja Takes On AP Govt Ruling | Sakshi
Sakshi News home page

‘మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు’

Jun 10 2025 12:44 PM | Updated on Jun 10 2025 1:23 PM

YSRCP Leader RK Roja Takes On AP Govt Ruling

చిత్తూరు జిల్లా:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో  మహిళలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి అనితకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నవాళ్లు లా అండ్‌ ఆర్డర్‌ కాపాడాలని, మరి అటువంటిది అధికారంలో ఉన్నవాళ్లే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు(మంగళవారం, జూన్‌ 10) ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. ‘మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటు. నగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.  

అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదు. పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చింది.  డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. హోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 

కొమ్మినేని శ్రీనివాసరావు పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దారుణం. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే మొదటగా చంద్రబాబు చెప్పాలి, ఆడబిడ్డ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపున చేయాలి అని మాట్లాడిన బాలకృష్ణ పై కేసు పెట్టాలి అన్న ఆయనపై కేసు పెట్టాలి’ అని రోజా తెలిపారు. 

జగన్ అన్న లండన్ వెళ్తే తప్పుడుడు వాఖ్యలు చేసిన నారా లోకేష్ పై ముందు కేసు పెట్టాలి. మూర్తి, రేణుక చౌదరి మాట్లాడిన మాటలు పై ఎందుకు కేసు నమోదు చేయాలేదు. బి.ఆర్.నాయుడు పై ఎందుకు కేసు పెట్టలేదు. కొమ్మినేని శ్రీనివాసరావు పై ఎప్పటి నుంచో కక్ష గట్టి చంద్రబాబు అరెస్ట్ చేయించారు. జూన్ 6 తేదీ ఈ డిస్కషన్ జరిగింది, కొమ్మినేని క్షమాపణ చెప్పారు. లోకేశ్, చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశారు. ఒక పథకం ప్రకారం యాక్షన్ ప్లాన్ తో సాక్షి పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లారు. ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోంది’ అని ధ్వజమెత్తారు ఆర్‌కే రోజా.

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: రోజా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement