సాక్షి,నెల్లూరు: చంద్రబాబు,లోకేష్‌కు అధికారులు భజన బ్యాచ్‌లా తయారయ్యారు. మా ప్రభుత్వం వచ్చాక అధికారులు పదింతలు చెల్లించుకుంటారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని పరామర్శించారు.
అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి సోదరులపై కక్షగట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతలు తన్నుకుని హత్యలు చేస్తున్నారు. ఖాకీ చొక్కాలు వేసుకోవాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు ధరిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేస్తూ భోజనం పెట్టడం లేదు. గుర్తుంచుకోండి తిరిగి మా ప్రభుత్వం వచ్చాక అన్నీ తిరిగి ఇస్తాము. అధికారులు నేతలకు, లోకేష్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేడు రాష్ట్రంలో గంజాయి, మహిళలపై దాడి, హత్యా రాజకీయాలు చేస్తుంది టీడీపీ.
రాష్ట్ర పరువును గంగపాలు చేశారు. సంపద అంటూ అప్పులు చేసుకుంటూ పోతున్నారు. నేటితో 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. అభివృద్ధి శూన్యం, సంక్షేమం జీరో. తాజాగా రాయలసీమ ప్రాంత వాసులకు వెన్నుపోటు పొడిచాడు. రాయలసీమ కరువు పరిష్కారం అయిన లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపివేయించాను అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఆస్తులు కాపాడుకోవడం కోసం ఈ ఘోరానికి ఒడిగట్టాడు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా వున్నారు.
బోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరిగి దిగారు.ఎన్నికలకు ముందు రాయి వేయడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. స్వయంగా జీఎంఆర్ కంపెనీ తెలిపింది వైఎస్ జగన్ హయాంలో నిర్మాణం జరుగుతుంది అని..2019లో కుప్పంలో ఎయిర్ పోర్టుకు చంద్రబాబు వేసిన రాయి సంగతి చూడండి. రామ్మోహన్ నాయుడు మైకుల ముందు హీరో.. చేసేది అంతా జీరో. పిన్నెల్లి రామకృష్టారెడ్డి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని సూచించారు.



