‘గాలిలో గెలిచిన గాలిగాడు.. కౌన్సిలర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ | Rk Roja Comments On Nagari Mla Bhanu Prakash | Sakshi
Sakshi News home page

‘గాలిలో గెలిచిన గాలిగాడు.. కౌన్సిలర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’

Jul 17 2025 1:38 PM | Updated on Jul 17 2025 3:32 PM

Rk Roja Comments On Nagari Mla Bhanu Prakash

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. టీడీపీ, జనసేన కూటమి దిగజారుడు రాజకీయాల చేస్తున్నాయని.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడతున్నారని మండిపడ్డారు.

గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికు వచ్చి తమిళనాడుకు టిప్పర్‌లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారు

సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా కానీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్ కౌన్సిలర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నగరి నియోజకవర్గం అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డగా మారింది. నువ్వు చేసిన అక్రమాలు బయటకు తీస్తా.. నీ అవినీతి బయటకు కక్కిస్తా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకున్నారు. తప్పుడు కేసులు కు భయపడం. మాకు వైఎస్‌ జగన్‌ అండగా ఉన్నారు. లక్ష 86 వేల కోట్లు అప్పులు చేసి చెత్త రికార్డు నమోదు చేశారు సీఎం చంద్రబాబు. వీళ్లను నమ్మి తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు.

టీడీపీ, జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి: రోజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement