‘వైఎస్‌ జగన్‌ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’ | YSRCP RK Roja Serious Comments On Chandrababu Naidu Govt, More Details Inside | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’

Aug 22 2025 8:12 AM | Updated on Aug 22 2025 10:23 AM

YSRCP RK Roja Serious Comments On CBN Govt

సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.. వైఎస్‌ జగన్‌ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలను తెలుస్తుంది అంటూ హెచ్చరించారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా అనకాపల్లిలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎక్కడికి వచ్చినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ైవైఎస్‌ జగన్‌ను మించిన అభివృద్ధిగానీ, సంక్షేమం కానీ కూటమి ప్రభుత్వం చేయలేదు. కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బతీసింది. ఈసారి వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.

ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే వస్తుంది. ఏపీలో వైఎస్‌ జగన్‌ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు అప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్న వారంతా కచ్చితంగా ఫలితం అనుభవిస్తారు అని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement