చిత్తూరు, సాక్షి: విజయవాడ వరదల సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన అనుకూల మీడియాతో బిల్డప్ ప్రచారం చేయించుకుంటున్నప్పటికీ.. సోషల్ మీడియా పుణ్యామాని వాస్తవ పరిస్థితులను కొందరు బయటపెడుతున్నారు. ఈ క్రమంలో..
అక్కడి ప్రజలకు అందుతున్న సహాయక చర్యలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం.. గత ప్రభుత్వపు సేవలపైనే ఆధారపడడం గమనార్హం. ఇదే విషయాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు.
వరద సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందేమీ లేదని అన్నారామె. జగన్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన వలంటీర్ వ్యవస్థ, సచివాలయ ఉద్యోగుల మొదలు.. ఆయన ప్రవేశపెట్టిన రేషన్ వాహనాలు, ఆయన హయాంలో కొన్న ఆంబులెన్స్ సర్వీస్ వాహనాలు, క్లీన్ ఆంధ్రా వాహనాలు.. ఇలా ప్రతీదానినిన ఇప్పుడు వరద సాయం కోసం కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని అన్నారామె.
అంతేకాదు.. వైఎస్సార్ హెల్త్ సెంటర్లు కూడా ఉపయోగించుకుంటోందని ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని తెలిపారామె. ఇక 80వేల మంది వరద ముంపునకు గురికాకుండా జగన్ ప్రభుత్వం కట్టించిన రిటైనింగ్ వాల్‌ను సైతం ఆమె ప్రస్తావించారు. ఇలా.. జగన్ చేసినవి, ఆలోచన, ముందుచూపు వల్లే విజయవాడ ప్రజలు కష్టాల నుంచి గట్టెక్కుతున్నారని తెలిపారామె.
జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు
జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ
జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ
జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్
జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు
జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు
జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు
జగనన్న తీసుకొచ్చిన వై… pic.twitter.com/dTi54Iwmud— Roja Selvamani (@RojaSelvamaniRK) September 6, 2024
Comments
Please login to add a commentAdd a comment