జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు: గుడివాడ అమర్‌నాథ్‌ | Restrictions on YS Jagan Mohan Reddy’s Visakhapatnam Tour Sparks Controversy | Gudivada Amarnath Slams Govt | Sakshi
Sakshi News home page

జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు: గుడివాడ అమర్‌నాథ్‌

Oct 8 2025 10:49 AM | Updated on Oct 8 2025 11:21 AM

Gudivada Amarnath Fires On Chandrababu Over Restrictions On Jagan Visit

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటీ? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్‌ జగన్‌ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్‌ జగన్‌ హెలికాఫ్టర్‌లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించిన రూట్‌ మ్యాప్‌ కాకుండా ఖాకీలు వేరే రూట్‌ మ్యాప్‌ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతుంది’’ అంటూ అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్ పర్యటనకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. వైఎస్‌ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాము. జగన్‌కు భద్రత కల్పించమని అడిగాము. విశాఖ ఎయిర్ పోర్టు మీదగా గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి మీదగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాము. రూట్ మార్చి పోలీసుకు రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్‌ను కవలకూడదు అని రూట్ మార్చారు.

ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఎంతోమంది స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైఎస్ జగన్ వెళ్తారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు. వైఎస్ జగన్ పర్యటనకు 18 నిబంధనలతో ఆంక్షలు పెట్టారు. ఎయిర్ పోర్టు, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరు.

చంద్రబాబు పర్యటనలో పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ప్రజలు చనిపోయారు. వాటిని పోలీసులు ఎందుకు పోలీసుల లేఖలో ప్రస్తావించలేదు. కరూర్ అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు. చంద్రబాబు ఆదేశాలు మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారు. పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదు. వాటిపై పునరాలోచన చేయాలి’’ అని అమర్‌నాథ్‌ కోరారు.

‘‘ఏ రోజు మేము జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదు. పోలీసులు 65,000 మంది ప్రజలు వస్తారని చెప్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు. పల్లా మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజలు నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌ను డైవర్ట్ చేయడం కోసం వైఎస్ జగన్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారు.

..నిన్నటి వరకు జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. ఈ రోజు రూటు మార్చి పర్యటన చేపట్టాలని పోలీసులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో నెలకు 1000 కోట్లు కూటమి నేతలు సంపాదించారు. 15 నెలల్లో 15 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ మైనింగ్‌లో కూటమి నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు.’’ అని గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement