బాబూ.. ప్రజాదరణ ఉన్న జగనన్నను అడ్డుకుంటారా?: రోజా | YSRCP RK Roja Serious Comments On Chandrababu Govt Over YS Jagan Palnadu Sattenapalli Visit, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

బాబూ.. ప్రజాదరణ ఉన్న జగనన్నను అడ్డుకుంటారా?: రోజా

Jun 18 2025 11:33 AM | Updated on Jun 18 2025 12:51 PM

YSRCP RK Roja Serious Comments On CBN Govt

సాక్షి, నగరి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. టీడీపీ కార్య‌ర్త‌లు చ‌నిపోయిన‌ప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్‌ వేదికగా..‘కూటమి ప్ర‌భుత్వ వేధింపులు భ‌రించ‌లేక‌ వైఎస్సార్‌సీపీ కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, ఆయ‌న కుటుంబాన్ని వైఎస్‌ జ‌గ‌న్ గారు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా?.  చంద్రబాబు గారూ.. మీ పార్టీ కార్య‌ర్త‌లు చ‌నిపోయిన‌ప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌లేదా?. ఆంక్ష‌లు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవాల‌ని చూడ‌టం ఏ మాత్రం క‌రెక్టు కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement