
సాక్షి, అనకాపల్లి: జనసేన పార్టీకి సర్‌ప్రైజ్ షాక్ తగిలింది. మునగపాక ఎంపీపీ మల్ల జయలక్ష్మి తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికే చేరుకున్నారు. ధర్మశ్రీ, కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఊహించని ఈ పరిణామంపై జనసేన వర్గాలు కంగుతిన్నాయి.
అభివృద్ధి కోసమే జనసేన పార్టీలో చేరాను. మా మండలాన్ని అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా కూటమి నేతలు మోసం చేశారు. పార్టీలో నన్ను అవమానాలకు గురి చేశారు. జనసేన పార్టీలో అభివృద్ధి కోరుకునేవారికి తగిన గుర్తింపు ఉండదు అని జయలక్ష్మి అన్నారామె. ఈసందర్భంగా వైఎస్సార్‌సీపీ కేడర్‌కు ఆమె క్షమాపణలు తెలియజేశారు.
వైయస్ఆర్సీపీని వీడి తప్పు చేశాను, నన్ను క్షమించాలి. చేసిన తప్పును సర్దించుకోవడం కోసం మళ్లీ వైఎస్సార్సీపీలో తిరిగి జాయిన్ అయ్యాను అని ఎంపీపీ మల్ల జయలక్ష్మి తెలిపారు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఆగష్టులో మల్ల జయలక్ష్మి జనసేనలో చేరారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీకి స్థానికంగా పెద్ద దెబ్బ పడిందంటూ జనసేన శ్రేణులు సంబురాలు చేసుకోవడమూ తీవ్ర చర్చనీయాంశంగానూ మారింది.