కలెక్టర్ కారుకు ప్రమాదం
కలెక్టర్ కారును ఢీకొన్న ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన మరో కారు
అనకాపల్లి టౌన్: జిల్లా కలెక్టర్ కారును మరో కారు ఢీ కొంది. డీజిల్ పోయించుకునేందుకు సోమవారం ఉదయం కలెక్టర్ కారును సబ్బవరం వైపుగా తుమ్మపాల ఏలేరు కాలువ టర్నింగ్ పాయింట్‌కు తీసుకువెళుతుండగా, సబ్బవరం వైపు వెళుతున్న మరో కారు బలంగా ఢీకొంది. ఈ సమయంలో కారులో కలెక్టర్ లేరు. రెండో కారు ముందు భాగం కొంత నుజునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.


