జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు మాకవరపాలెం విద్యార్థి
ఎంపికై న విద్యార్థి తేజరామ్‌తో వ్యాయామ ఉపాధ్యాయులు రవి, చంద్రదేవి
నర్సీపట్నం: మాకవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి వి.తేజరామ్ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడని హెచ్‌ఎం నారాయణరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వీరవాసంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ 17 విభాగంలో విద్యార్థి వి.తేజరామ్ మంచి ప్రతిభను కనబరిచాడు. ఉమ్మడి విశాఖ జిల్లా నుండి విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థి తేజరామ్‌ను, వ్యాయామ ఉపాధ్యాయులు రవి, చంద్రదేవిలను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.


