నాగజ్యోతి, సాహితీలకు సత్కారం
ఆంగ్ల ఉపాధ్యాయిని నాగజ్యోతి, ఆమె కుమార్తె సాహితీలకుసన్మానం
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి, జల యోగాసానాల్లో 32 ప్రపంచ రికార్డులను సాధించిన ఆమె కుమార్తె సాహితీలను ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఘనంగా సన్మానించారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన తల్లీ, కుమార్తెలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ లిఫ్టింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు సాధించిన ఇంగ్లిష్ టీచర్ నాగజ్యోతి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు పొందడం ఎంతో గర్వకారణమని చెప్పారు. అలాగే ఆమె కుమార్తె తల్లికి తగ్గ తనయలా జలయోగాసనాల్లో ప్రపంచ రికార్డులను సాధించడమే కాక తొమ్మిదో తరగతిలోనే అమెరికాలో ‘నాసాను’ సందర్శించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్‌లో వీరు మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.


