1990లో టాప్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన 'కళా' మాస్టర్
'కొచ్చు కొచ్చు సంతోషంగల్' చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డ్ అందుకున్నారు.
12 సంవత్సరాల వయసులోనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అరంగేట్రం చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.
తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, ఒరియా, బెంగాలీ, ఇంగ్లీష్, ఇటాలియన్, జపనీస్ వంటి వివిధ భాషలలో 4000కి పైగా పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
'చంద్రముఖి' సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నారు.
1990 సమయంలో రోజా, మీనా, రంభ, దేవయానిలు నటించిన చాలా సినిమాలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
వారితో మంచి స్నేహం ఉండటం వల్ల తాజాగా చెన్నైలో కలిశామని, అందరం కలిసి మంచి భోజనం చేశామని కళా మాస్టర్ ఫోటోలు షేర్ చేశారు.


