
రెండు కోట్ల మంది మహిళలను..ఎంత పబ్లిగ్గా.. మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం..ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు.ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకం అమలుపై స్పందిస్తే.. ‘‘ మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ హాజరైన మహిళలు ఒక్కసారిగా కంగుతిన్నారు.
అయితే.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా? అంటూ అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తే రోజా ఓ పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? అంటూ పోస్ట్ చేశారు. అదే సమయంలో..
బాబు ష్యూరిటీ.. వెన్నుపోటు గ్యారంటీ..!. 2 కోట్ల మంది మహిళలను..ఎంత పబ్లిగ్గా.. మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం..ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు.ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారు అంటూ వీడియోలతో పోస్టులు చేశారామె.
`సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా… pic.twitter.com/v9v8fq8C1r
— Roja Selvamani (@RojaSelvamaniRK) July 22, 2025